బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. అయితే నిరాహార దీక్ష చేస్తున్న E1, E2విద్యార్థులను ఆందోళన విరమించాలని స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్(SGC) పిలుపునిచ్చింది. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా మధ్యాహ్న భోజనం చేయాలని SGC ప్రెసిడెంట్ మదేశ్ సూచించారు . సెలవుల తర్వాత అందరం కలిసి పోరాటం చేద్దామంటూ పిలుపునిచ్చారు.
సమస్యలు పరిష్కరించాలంటూ.. ట్రిపుల్ ఐటీ E1, E2 విద్యార్థులు రాత్రి నుంచి నిరసన చేస్తున్నారు. శనివారం రాత్రి భోజనం చేయకుండా తెల్లారి 3 గంటల వరకు మెస్ లో జాగారం చేశారు. ఉదయం నుంచి బ్రేక్ ఫాస్ట్ కూడా చేయకుండా ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. ఐదు డిమాండ్లపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఐదు డిమాండ్లలో ఒకటైన మెస్ ఇష్యూపై వెంటనే స్పందించి.. మెస్ టెండర్లు పిలిచారు. మిగితా 4 డిమాండ్లపై నిలదీస్తున్నారు విద్యార్థులు.
విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు బయల్దేరిన బీజేపీ ఎంపీ సోయం బాపురావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ జిల్లా బైంసా సమీపంలోని నందన్ ఎక్స్ రోడ్డు వద్ద సోయం బాపురావుతో పాటు పలువురు బీజేపీ నేతలను అడ్డుకొని లోకేశ్వరం పీఎస్ కు తరలించారు. బాసర ట్రిపుల్ ఐటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రిపుల్ ఐటిలోకి సిబ్బంది మినహా ఇతరులను ఎవరినీ రాణించడం లేదు. యూనివర్సిటీ పరిసరాల్లో పోలీసుల ఆంక్షలు విధించారు.
