సీఎం రేవంత్ రెడ్డికి రైతుల కష్టాలు తెలుసు : వీర్లపల్లి శంకర్

 సీఎం రేవంత్ రెడ్డికి  రైతుల కష్టాలు తెలుసు : వీర్లపల్లి శంకర్

షాద్ నగర్, వెలుగు: రైతు కుటుంబం నుంచి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి అన్నదాతలు పడే కష్టాలు తెలుసని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. తన క్యాంపు ఆఫీస్​లో ఆదివారం ఆయన మాట్లాడారు. రైతు రుణమాఫీతో 39 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. 

గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పట్ల కర్కశంగా వ్యవహరించిందన్నారు. సమావేశంలో పీసీసీ సభ్యులు బాబర్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గండ్రతి బాలరాజు గౌడ్, మైనార్టీ నాయకులు ఇబ్రహీం, కేశంపేట మండల సీనియర్ నాయకులు సురేశ్ రెడ్డి, సయ్యద్ ఖదీర్, ముబారక్ ఖాన్ తదితరులు ఉన్నారు.