మ్యాచ్ మధ్యలో తమ ఆరాధ్య క్రికెటర్లను కలుసుకోవాడానికి అభిమానులు పరుగెత్తుకొని రావడం చాలా సందర్భాలలో జరిగింది. తాజాగా ఓ పాకిస్థాన్ అభిమాని కూడా అలాగే చేశాడు. మ్యాచ్ జరుగుతుండగా తన ఫేవరట్ క్రికెటర్ వద్దకు వచ్చి నిల్చోని సెల్యూట్ చేశాడు. అయితే ఆతనికి అ క్రికెటర్ ఊహించని గిప్ట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం వెస్ట్ ఇండీస్, పాక్ జట్ల మధ్య వన్డే సిరీస్ నడుస్తోంది. శుక్రవారం ముల్తాన్ వేదికగా జరిగిన రెండో వన్డే జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో పాక్ ఆల్‌రౌండర్, వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ 9 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా ఓ వ్యకి ఎక్కడినుంచో వచ్చాడో తెలియదు కానీ సడన్ గా స్టేడియంలోకి వచ్చి షాదాబ్ ముందు నిలబడి అతనకి సెల్యూట్ చేశాడు. దీంతో షాదాబ్ కూడా అంతే ఆప్యాయంగా స్పందిస్తూ ఆ అభిమానిని ప్రేమగా హత్తుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో నెటిజన్లు షాదాబ్ చేసిన పనికి పిధా అవుతున్నారు.
Beautiful Fan moment - A fan ran towards Shadab Khan and hugged him...??? #PAKvWI pic.twitter.com/cvshT39y19
— Girl with no job ? (@girlwithnojob88) June 10, 2022

