కరెంట్ కట్ చేశారని ట్రాన్స్ జెండర్లు ఆందోళన

కరెంట్ కట్ చేశారని  ట్రాన్స్ జెండర్లు ఆందోళన

షాద్ నగర్, వెలుగు: షాద్​నగర్ విద్యుత్ శాఖ ఏఈ కార్యాలయాన్ని పలువురు ట్రాన్స్ జెండర్లు శనివారం ముట్టడించారు. తాము నివాసం ఉండే  సీఎస్కే విల్లాస్ ఫేస్- 2లో కరెంట్​సరఫరాను నిలిపివేయడంతో ఇబ్బందులు పడుతున్నామని ఫైరయ్యారు. 

ఈ విషయమై ఏఈ వినోద్ మాట్లాడుతూ.. ట్రాన్స్ జెండర్లు తమ కార్యాలయానికి వచ్చిన మాట వాస్తవమేనన్నారు. శిల్ప సంస్థకు కనెక్షన్ ఇచ్చామని, అక్కడి నుంచి ప్రైవేట్ వ్యక్తుల నివాసాలకు వారు కనెక్షన్స్​లు ఇచ్చి నెలనెల డబ్బులు తీసుకున్నారన్నారు. గత 3 నెలలుగా డబ్బులు చెల్లించకపోవడంతో శిల్ప సంస్థకు కరెంటు తొలగించామని వివరించారు.