
షాద్ నగర్, వెలుగు: ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ పాలన సాగిస్తోందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం చంద్రాయన్ గూడలో రూ.12 లక్షలతో మహిళా డ్వాక్రా భవనం, రూ.70 లక్షలతో మేకగూడ నుంచి జేపీ దర్గా వరకు బీటీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. అనంతరం రంగాపూర్ లో రూ.15 లక్షలతో అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షాద్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఎం.శివశంకర్ గౌడ్, గోవర్ధన్ గౌడ్, జంగ నరసింహులు, జిల్లెల్ల బాల్ రెడ్డి, కొమ్ము కృష్ణ పాల్గొన్నారు.