
- షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్ నగర్, వెలుగు : కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సోమవారం షాద్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొందుర్గ్, చౌదర్ గూడెం, కేశంపేట మండలాల వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు
ప్రజాప్రతినిధులు నమన్వయంతో పని చేసేందుకు కృషి చేయాలని, ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని సూచించారు. ఏయే శాఖలో ఏ సమస్యలు ఉన్నాయో వాటి వివరాలను అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏయే సమస్యలు ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు.