KKR vs SRH: గంభీర్‌కు కిస్.. రానాకు ఫ్లయింగ్ కిస్.. గ్రౌండ్‌లో షారుఖ్ సెలెబ్రేషన్ మాములుగా లేదుగా

KKR vs SRH: గంభీర్‌కు కిస్.. రానాకు ఫ్లయింగ్ కిస్.. గ్రౌండ్‌లో షారుఖ్ సెలెబ్రేషన్ మాములుగా లేదుగా

సన్ రైజర్స్ పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ఫైనల్ గెలిచిన తర్వాత కేకేఆర్ యజమాని షారుఖ్ ఖాన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఫైనల్లో అతని సంబరాలు అంబరాన్ని అంటాయి. ఫైనల్ వరకు ఎంతో కూల్ గా కనిపించిన ఈ బాలీవుడ్ బాద్ షా టైటిల్ గెలిచేసరికీ గ్రౌండ్ లో చిన్నపిల్లాడిలా హడావుడి చేశాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత సెలెబ్రేషన్ లో భాగంగా మొదట మెంటార్ గంభీర్ దగ్గరకు వచ్చి తన నుదుట మీద ముద్దు పెట్టుకున్నాడు. 

ఆ తరువాత కేకేఆర్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ దగ్గరకు వెళ్లి అతన్ని కౌగిలించుకొని హత్తుకున్నాడు. ఇక హర్షిత్ రానా దగ్గర షారుఖ్ హడావుడి మాములుగా లేదు. ఈ యువ బౌలర్ దగ్గరకు వచ్చి అతని స్టయిల్లోనే ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు. రానా షారుఖ్ ను ఎత్తుకున్న ఫోటో హైలెట్ గా నిలిచింది. ఇక గ్రౌండ్ లో తాను నటించిన జవాన్ సినిమాలో స్టెప్ తో అదరగొట్టిన షారూఖ్ గ్రౌండ్ అంతా రెట్టించిన ఉత్సాహంతో తిరిగాడు.  క్వాలిఫయర్ 1లో సన్ రైజర్స్ పై కేకేఆర్ విజయం సాధించిన తర్వాత డీహైడ్రేషన్ కారణంగా షారుఖ్ అహ్మదాబాద్‌లోని ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఒక్క రోజులో కోలుకున్న ఇతను సెలెబ్రేషన్ వైరల్ గా మారాయి. 

కోల్ కతా కు ఇది మూడో ఐపీఎల్ టైటిల్. గంభీర్ కెప్టెన్సీలో కేకేఆర్ 2012 లో చెన్నై సూపర్ కింగ్స్ పై, 2014 లలో పంజాబ్ కింగ్స్ పై టైటిల్ గెలిచాయి. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌‌ కేకేఆర్ బౌలర్లు విజృంభించడంతో 113 రన్స్‌‌కే ఆలౌటైంది. ఇప్పటి వరకు జరిగిన 17  ఫైనల్స్‌‌లో ఇదే అతి తక్కువ స్కోరు. కోల్‌‌కతా 10.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి టార్గెట్‌‌ను ఛేజ్‌‌ చేసి ఈజీగా గెలిచింది. స్టార్క్ కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది.