నేను విలనైతే.. ఏ హీరో నిలబడలేడు.. దుమ్ములేపిన జవాన్ ట్రైలర్

నేను విలనైతే.. ఏ హీరో నిలబడలేడు.. దుమ్ములేపిన జవాన్ ట్రైలర్

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్(Shah rukh khan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జవాన్(Jawan). పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్(Atlee kumar) తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కిస్తోంది. ట్రైలర్ లో ఒక్కో షాట్, ఒక్కో విజువల్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి.

ఇక షారుఖ్ చెప్పిన డైలాగ్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ట్రైలర్ చివర్లో చెప్పిన.. "నేను విలనైతే.. నాముందు ఏ హీరో నిలబడలేడు" అనే డైలాగ్ అయితే ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయిస్తున్నాయి. అట్లీ టేకింగ్ టాప్ నాచ్ అని చెప్పాలి. సినిమాలో చాలా షేడ్స్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇంకా అట్లీ మరోసారి తన గత సినిమాల్లోలాగే ఈ సినిమాలో కూడా ఆడవాళ్ళకి పెద్ద పీట వేసినట్టు కనిపిస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి(Vijay sethupathi), నయనతార(Nayanathara), దీపికా పదుకోన్(Deepika padukone), ప్రియమణి(Priyamani) వంటి స్టార్స్ కూడా వర్క్ చేశారు. 

ఈ ట్రైలర్ లో మరో మెయిన్ హైలెట్ అంటే.. అనిరుద్(Anirudh) ఇచ్చిన మ్యూజిక్. ఒక్కో సీన్ ను తన బీజీఎంతో నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాడు అనిరుద్. పక్కా కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని ఎలిమేట్స్ ఈ ట్రైలర్లో కనిపించాయి. సెప్టెంబర్ 7న ఇండియాన బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.