
సెలబ్రెటీలు, టాప్ స్టార్స్ కనిపించారంటే చాలు మీడియా ప్రతినిధులు వారిపైకి ఎగబడుతుంటారు. కొన్నో సార్లు వాళ్ళు చూపించే అత్యుత్సాహానికి స్టార్ కోపగించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కు ఎదురైంది.
Look at the Atitude of FLOP & Loser Actor #ShahidKapoor towards Media Person. BC Chutiye Shame on you ! Yeh Media Wale Hi Tumko " Star " banate han..!! Feeling sad after watching face of Poor Photographer. Tu Kabi HIT film nahi de paye ga. Wait & watch. #BoycottShahidKapoor. pic.twitter.com/MFuBdzj1SR
— Umair Sandhu (@UmairSandu) September 2, 2023
ఇటీవల షాహిద్ కపూర్.. తన భార్య మీరా రాజ్‌పుత్, అత్తగారు బేలా రాజ్ పుత్‌తో కలిసి ముంబైలో రుహాన్ కపూర్- మనుకృతి పెళ్లి రిసెప్షన్ కు హాజరయ్యారు. ఎంతో ఘనంగా జరిగిన ఈ రెసెప్షన్ లో వధూవరులను కలిసి ఆశీర్వదించారు షాహిద్ దంపతులు. అక్కడ అందిరీతో ఆనందంగా గడిపారు. ఇక వేడుక ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో కారు దగ్గరికి వచ్చారు ఈ జంట. దీంతో ఒక్కసారిగా అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధులు.. ఫోటోల కోసం ఎగబడ్డారు. మీడియా ప్రతినిధుల తీరుకు సహనం కోల్పోయిన షాహిద్ కోపం తెచ్చుకున్నాడు. ఫొటోగ్రాఫర్లుపై అరిచాడు. పిచ్చోళ్లలాగ బిహేవ్ చేయకండి. మిమ్మల్ని పట్టించుకోకుండా వెళ్తున్నప్పుడు ఇలా చేయడంలో అర్థం ఉంది కానీ.. నేను ఇక్కడే ఉన్నాను కదా ఎందుకు అలా అరుస్తున్నారు. నేను మీకు కావాల్సినన్ని ఫోటోలు ఇచ్చాకే ఇక్కడి నుండి వెళ్తాను అరవకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం షాహిద్ కు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.