
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shahrukh khan), నయనతార(Nayantara) కాంబోలో వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ జవాన్(Jawan). పఠాన్(Pataan) వంటి బ్లాక్ బస్టర్ తరువాత షారుక్ నుండి వస్తున్న సినిమా కావడంతో ముందే న్యూడ్ జవాన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తగ్గకుండా టీజర్, ట్రైలర్ కూడా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేశారు. విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె, ప్రియమణి వంటి స్టార్ కీ రోల్ లో కనిపించిన ఈ సినిమాను.. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించాడు. షారుఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్‌స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా జవాన్ సినిమాను నిర్మించారు.
భారీ అంచనాల మధ్య ఈ సినిమా నేడు(సెప్టెంబర్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్ సీస్ లో ప్రీమియర్స్ పడగా.. సినిమా చూసిన ప్రేక్షకులు తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. మరి ఈ సినిమాపై ప్రేక్షకుల టాక్ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూదాం.
షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాను ట్విటర్‌లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. షారుఖ్ ఖాతాలో మరో భారీ బ్లాక్ బస్టర్ పడిందనే కామెంట్ వినిపిస్తున్నాయి. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయని, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ ఖాయమనే కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్.
ఇక మరికొందరేమో.. జవాన్ షారుఖ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలువనుందని ట్వీట్స్ చేస్తున్నారు. అంతేకాదు జవాన్ సినిమా కథ, కథనం ఆకట్టుకున్నాయని, షారుఖ్ నటన అద్భుతముగా ఉందని, షారుఖ్ ను పవర్ ఫుల్ గ ప్రెజెంట్ చేయడంలో అట్లీ సూపర్ సక్సెస్ అయ్యాడనే, అనిరుద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాలని చెప్తున్నారు.
ఇక మొత్తంగా జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని, అట్లీ ఓ అద్భుతమైన కళాఖండాన్ని అందించాడని, సినిమాలో ఎమోషన్స్ అండ్ మాస్ యాక్షన్స్ సీన్స్ అద్భుతంగా పండాయని చెప్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే జవాన్ సినిమా కూడా రూ.1000 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
#Jawan Early Review
— ConectMagnet (@ConectMagnet) September 7, 2023
B L O C K B U S T E R: ⭐️⭐️⭐️⭐️⭐️#Atlee has delivered a masterpiece, an exhilarating blend of emotion and mass action
This year belongs to the baadhshah #ShahRukhKhan? ? #VijaySethupathi #Nayantara & rest were great
DON'T MISS IT !!#JawanReview pic.twitter.com/lKuYZ6oWGr