
షేక్ మొహమ్మద్ ఉస్మాన్.. జాన్పూర్ బార్లో లీడింగ్ లాయర్. ఆయన కొడుకే షా సులేమాన్. మొదట్నించీ సులేమాన్‌కు చదువంటే మక్కువ.1906లో జరిగిన బి.ఎ పరీక్షలో పాస్ అయి ఎన్నో పతకాలు గెలుచుకున్నారు.1906లో షా సులేమాన్ యునైటెడ్ ప్రావిన్స్ స్టేట్ స్కాలర్షిప్కు ఎంపికై, ఆ ఏడాదే కేంబ్రిడ్జికి వెళ్లారు.1909లో ఆయన గణిత శాస్త్ర ‘ట్రిపోస్’ను,1910లో ‘లా ట్రిపోస్’ను పొందాడు.1909లో ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్ష కూడా రాశారు. కానీ, ఎంపిక కాలేదు. దాంతో డబ్లిన్ యూనివర్సిటీలో చదివి ఎల్ఎల్డి పట్టా అందుకున్నారు.
1911లో డా. షా సులేమాన్ ఇండియాకు తిరిగి వచ్చారు. తన తండ్రి వద్ద జూనియర్‌గా ఏడాదిపాటు ప్రాక్టీస్ చేశారు.1912లో అలహాబాద్‌కు మారారు. అక్కడ షేర్కోట్ కాళి, బంగాళీ, ధరంపూర్, బిల్వాల్ కేసుల్లో బారిష్టర్‌గా తొలి విజయాలు అందుకున్నారు. అలా ఆయనకు 34 ఏండ్ల వయసులో ‘బెంచ్’ సీటు ఆఫర్ వచ్చింది. షా వల్లే సంయుక్త రాష్ట్రాలలో ‘ది ప్రి–ఎంషన్ లా’ నిర్మాణం జరిగింది. ఆయన 43వ ఏట చీఫ్ జస్టిస్, 46వ ఏట అలహాబాద్ హైకోర్ట్ శాశ్వత చీఫ్ జస్టిస్ అయ్యారు.
ఐదేండ్ల తర్వాత ఫెడరల్ కోర్ట్‌కు ఎలివేట్ అయ్యారు. 1934లో అలహాబాద్‌లో దయాల్– బాగ్ పారిశ్రామిక ప్రదర్శనను స్టార్ట్ చేయాలని హైకోర్ట్ చీఫ్ జస్టిస్ సర్ షాని దయాల్– బాగ్ మోడల్ ఇండస్ట్రీస్, ఆగ్రా అధినేత సర్ ఆనంద్ సరూప్ సహాబ్జీ మహరాజ్ కోరారు. ఆ సందర్భంగా షాను ఉద్దేశించి ‘ప్రపంచ వ్యాప్త గౌరవం పొందిన భారత మేధావి’ పొగిడారు.
విజయ పరంపర
- 1930 పెషావర్ అల్లర్ల గురించి ఎంక్వైరీ చేయడానికి ‘పెషావర్ ఎంక్వైరీ కమిటీ’ని నెలకొల్పారు. సులేమాన్ ఆ కమిటీలో సీనియర్ మెంబర్. ఆయన చేసిన సిఫార్సులను ప్రభుత్వం ఆచరణలో పెట్టింది.
- లార్డ్ మ్యూనెడిన్, లార్డ్ టామిన్లతోపాటు ‘క్వాపిటేషన్ రేట్స్ ట్రైబ్యునల్’లో సభ్యుడిగా షా చేసిన సిఫార్సుల వల్లే ఇంగ్లండ్ ప్రభుత్వం, భారత సైన్యం ఖర్చులో కొంత భరించడానికి ఒప్పుకుంది.
- మీరట్ కుట్ర కేసు మెజిస్ట్రేట్ కోర్టులో రెండేండ్లు, సెషన్స్ కోర్టులో నాలుగేండ్లు ఉంది. హైకోర్టులో అప్పీల్ మీద వాదనలు కొన్ని నెలలు జరగొచ్చు అనుకున్నారు. కానీ, ఆ అప్పీల్లో హియరింగ్, తీర్పు అన్నీ 8 రోజుల్లో పూర్తయ్యాయి. చీఫ్ జస్టిస్‌గా సర్ షా ఇచ్చిన తీర్పు భారతదేశ జ్యుడీషియల్ అడ్మినిస్ట్రేషన్ చరిత్రలోనే ఒక గీటురాయి.
అలహాబాద్‌లో ‘ముస్లిం హై స్కూల్’ ‘మదర్సా – ఇ – సుభానియా’ స్థాపకులలో ఒకడు సులేమాన్.1928లో సాహెబ్ జాదా అఫ్తాబ్ అహ్మద్ ఖాన్, డా. జా ఉద్దీన్ అహ్మద్‌ల మధ్య వివాదం రహ్మతుల్లా ఎంక్వైరీ కమిటీ ఏర్పాటుకి దారితీసింది. ఆ కమిటీ సభ్యులు ఆచరణకు దూరమైన మార్పులను సిఫార్సు చేశారు. ఆ సమయంలోనే యూనివర్సిటీ వైస్ – ఛాన్స్లర్ అయిన సర్ షా అన్ని రూల్స్, రెగ్యులేషన్స్6 నెలల కాలంలోనే ఆధునిక అవసరాలకు, రహ్మతుల్లా కమిటీ సిఫార్సులకు అనుగుణంగా క్రమబద్ధీకరించారు. ఆయన చేసిన ప్రయత్నాల వల్ల1929 సెప్టెంబర్‌లో గవర్నమెంట్ ఇండియా15 లక్షల గ్రాంటును ఇచ్చింది.
- ఆయన పరిపాలనా కాలంలో బోధనా సిబ్బందిని 55 ఏండ్ల వరకు కాంట్రాక్ట్ లోనే రావాలని, ఎక్కువ గంటలు పనిచేయాలని కోరారు. ఆర్థిక సమర్థతతో వాటర్ వర్క్స్, వ్యవసాయ, సాంకేతిక సంస్థ, హౌజింగ్ అసెస్మెంట్ లాంటి స్కీంలను ప్రవేశపెట్టారు.
- అలీగఢ్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా వారాంతాల్లో పారితోషికం తీసుకోకుండా పనిచేశారు. యూనివర్సిటీ కోర్టు ఆయనకు పూర్తి అధికారాలను (కార్టే బ్లాంకే) ఇచ్చింది. సర్ షా ఢిల్లీ ఆంగ్లో – అరబిక్ కాలేజీ అధ్యక్షుడి కూడా సేవలందించారు.
- 1936లో లెజిస్లేచర్ సభ్యుల ప్రశ్నలకు జడ్జిల జ్యుడీషియల్ పనులు, అఫీషియల్ రిసీవర్స్ నియామకం గురించి జవాబు ఇవ్వడానికి సర్ షా తిరస్కరించడం యునైటెడ్ ప్రావిన్స్‌లో చరిత్ర సృష్టించిన సంఘటన.
- మేకల మదన్మోహన్ రావు,కవి, రచయిత-