విడాకుల ఫోటో షూట్.. వైరల్ అవుతున్న షాలిని పోస్ట్

విడాకుల ఫోటో షూట్.. వైరల్ అవుతున్న షాలిని పోస్ట్

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన తమిళ సీరియల్ నటి షాలిని పేరే వినిపిస్తోంది. రీసెంట్ గా ఆమె తన డీవోర్స్ ని సెలబ్రేట్ చేసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఆవికాస్త క్షణాల్లో వైరల్ గా మారాయి. దీంతో ఆమె ఒక్కసారిగా ఇండియా వైడ్ హాట్ టాప్ గా మారింది. దీంతో ఆమె గురించి తెల్సుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.

 షాలిని 2020లో రియాజ్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకుంది. వీళ్ళకు ఓ పాప కూడా ఉంది. మూడేళ్ళ వైవాహిక జీవితం అనంతరం.. కొన్ని అనుకోని కారణాల వల్ల ఇద్దరు విడిపోవాల్సి వచ్చింది. డివోర్స్ కూడా తీసుకున్నారు. ఎంతకాలం నుండి ఈ డీవోర్స్ కోసం ఎదురుచూస్తుందో తెలియదు కానీ.. వచ్చీన వెంటనే సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకే.. విడాకులను వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్నారు షాలిని. ఆమె తన పెళ్లి ఫోటోను చింపేస్తూ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోస్ ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది..

''సంతోషంగా ఉండటం ముఖ్యం... అందుకని, బ్యాడ్ మ్యారేజ్ నుంచి వైదొలగడం తప్పేమీ కాదు. మన జీవితాన్ని మన కంట్రోల్ లో ఉంచుకోవాలి. మంచి భవిష్యత్ కోసం, మన పిల్లల కోసం మారడం కూడా ముఖ్యమే. విడాకుల తీసుకోవడం ఫెయిల్యూర్ ఏమీ కాదు. జీవితంలో అది ఒక టర్నింగ్ పాయింట్. వైవాహిక బంధం నుంచి బయటకు రావడానికి చాలా ధైర్యం కావాలి. ధైర్యవంతులైన మహిళలు అందరికీ నేను ఈ ఫోటో షూట్ అంకితం ఇస్తున్నా'' అని షాలిని పేర్కొన్నారు.  ఇక ఈ ఫోటో షూట్ వైరల్ కావడంతో మీడియాలో షాలిని మరో పోస్ట్ పెట్టింది. తన ఫోటో షూట్ మీద ఆసక్తి చూపించిన వారందరికీ థాంక్స్ చెప్పింది. ఇక తను ఇంటర్వ్యూలు ఇవ్వడానికి రెడీగా లేనని కూడా స్పష్టం చేసింది. పబ్లిసిటీ కోసం ఆ ఫోటో షూట్ చేయలేదని, తన లాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న మహిళలు అందరికీ సందేశం ఇవ్వడం కోసమే చేశానని పేర్కొంది షాలిని.