ఇతర రాష్ట్రాల మద్యం.. ఈవెంట్ లలో వాడితే కఠిన చర్యలు: శంషాబాద్, గండిపేట ఎక్సైజ్ అధికారుల హెచ్చరిక

ఇతర రాష్ట్రాల మద్యం.. ఈవెంట్ లలో వాడితే కఠిన చర్యలు: శంషాబాద్, గండిపేట ఎక్సైజ్ అధికారుల హెచ్చరిక

గండిపేట, వెలుగు: శంషాబాద్, గండిపేట పరిధిలోని ఫంక్షన్ హాళ్లు, ఫామ్ హౌస్​లు, గేటెడ్ కమ్యూనిటీ క్లబ్​లలో నిర్వహించే వేడుకలకు తప్పనిసరిగా ఎక్సైజ్ శాఖ వెబ్​సైట్ ద్వారా ఈవెంట్ పర్మిట్ తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. కేవలం సుంకం చెల్లించిన (డ్యూటీ పేయిడ్) మద్యాన్ని మాత్రమే వినియోగించాలని ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ పరిధిలో 12 వేల రూపాయలు, ఇతర ప్రాంతాల్లో 9 వేల రూపాయల సుంకం చెల్లించి అనుమతి పొందాలని సూచించారు. 

నిబంధనలకు విరుద్ధంగా గోవా, హర్యానా, ఢిల్లీ వంటి ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన మద్యం (నాన్ డ్యూటీ పేయిడ్ లిక్కర్) వినియోగిస్తే ఫంక్షన్ హాల్ యజమానులు, ఈవెంట్ నిర్వాహకులపై కఠిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 

వేడుకల్లో ఎటువంటి డ్రగ్స్ లేదా సుంకం చెల్లించని మద్యం వాడుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే 8712658750 నంబర్​కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు.