
గండిపేట, వెలుగు: కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్న ఇద్దరు ముఠా సభ్యులను శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. రాజేంద్రనగర్ కాటేదాన్ ప్రాంతంలోని ఓ ఫంక్షన్ కు కారులో మద్యం తరలిస్తుండగా, బుధవారం వీరిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుంచి 72 మద్యం బాటిళ్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఖరీదైన మద్యం బాటిళ్లను తక్కువ ధరకు సప్లై చేస్తామని నిందితులు ఒప్పందం చేసుకొని, ఢిల్లీ లేబుల్స్ బాటిళ్లలో కల్తీ మద్యం మిక్సింగ్ చేసి సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.