ఫాంహౌస్​లో అర్ధరాత్రి ముజ్రా పార్టీ

ఫాంహౌస్​లో అర్ధరాత్రి ముజ్రా పార్టీ

నలుగురు రౌడీ షీటర్లు సహా 48 మంది, నలుగురు ట్రాన్స్​జెండర్లు అరెస్ట్

శంషాబాద్, వెలుగు: సిటీ శివారులోని ఓ ఫాంహౌస్​లో అర్ధరాత్రి తర్వాత నిర్వహించిన ముజ్రా పార్టీలో పాల్గొన్న నలుగురు రౌడీషీటర్లు సహా 48 మందిని, నలుగురు ట్రాన్స్​జెండర్లను శంషాబాద్ ఎస్ఓటీ, రూరల్ పోలీసులు అరెస్ట్​చేశారు. వారి వివరాల ప్రకారం.. మైలర్ దేవ్ పల్లికి చెందిన బాబాఖాన్​పై పోలీసులు ఇటీవలే రౌడీ షిట్​ఎత్తేశారు. శంషాబాద్ మండలం రమంజాపూర్ గ్రామంలోని ఓ ఫాంహౌస్​లో శనివారం అర్ధరాత్రి బాబా ఖాన్ ముజ్రా పార్టీని ఏర్పాటు చేశాడు. ఆదివారం తెల్లవారుజాము వరకు డీజే శబ్దాలు వస్తుండడంతో స్థానికులు శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు, రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థలానికి చేరుకున్న పోలీసులు నిర్వాహకుడు సహా 48 మందిని, నలుగురు ట్రాన్స్ జెండర్లను అరెస్ట్​చేశారు. 4 కత్తులు, 5 హుక్కా పాట్లు, 49 సెల్ ఫోన్‌‌లు, 12 బైకులు, 4 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్​అయిన వారిలో రౌడీ షీటర్లు అయిన అజార్, మహబూబ్, యాసీన్, సోహైల్​ఉన్నారు.