
శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జిని క్లోజ్ చేశారు. హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవేపై ఉన్న ఈ బ్రిడ్జిపై నేషనల్ హైవే అధికారులు లోడ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. అందుకే బ్రిడ్జిని మూసేశారు. బుధవారం కూడా మూసి ఉంటుందని, తిరిగి గురువారం రాకపోకలు యథావిధిగా సాగుతాయని నేషనల్ హైవే అధికారులు తెలిపారు.