బీజేపీకి బీఆర్ఎస్ 'బీ' టీమ్..జాగో తెలంగాణ అంటూ..

బీజేపీకి బీఆర్ఎస్ 'బీ' టీమ్..జాగో తెలంగాణ అంటూ..

నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ బీ టీమ్ అంటూ అరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలో కేవలం కాంగ్రెస్, ఎన్సీపీలను మాత్రమే టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. బీఆర్ఎస్ బీజేపీకి చెందిన 'బీ' టీమ్  అనిపిస్తోందని చెప్పారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా..ఏ రాష్ట్రంలోనైనా తమ పార్టీని విస్తరించుకునే హక్కు  ఉందని..అయితే బీఆర్‌ఎస్ను .... బీజేపీ  బీ టీమ్ కాదా అనేది చూడాలన్నారు.

ఇప్పటికైనా అర్థం అయిందా...

బీఆర్ఎస్ ను బీజేపీ బీ అంటూ శరద్ పవార్ అభివర్ణించడంపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు అర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. దేశ రాజకీయాల్లో అపర చాణక్యుడైన శరద్ పవార్..  భారతదేశ సమకాలీన రాజకీయాల్ని చాలా దగ్గరి నుండి చూసిన వ్యక్తి అని చెప్పారు. అలాంటి శరద్ పవార్..కేసీఆర్ వ్యవహార శైలిని బట్టి బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అంటున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు  అర్థం చేసుకోవాలని కోరారు. , ఎవరు ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారో గమనించాలని సూచించారు. 

గులాబీలే నిజమైన బత్తాయిలు

కేసీఆర్ డైరెక్షన్లో నడుస్తున్న ఈ రసవత్తరమైన డ్రామాలో ప్రేక్షకులం, పావులం, వంచితులం మన తెలంగాణ ప్రజలమే. జాగో తెలంగాణ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. 

మహారాష్ట్రపై కేసీఆర్ దృష్టి

జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించేందుకు డిసైడ్ అయిన సీఎం కేసీఆర్...టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మార్చారు. బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో పర్యటించి..ఆయా రాష్ట్రా్ల్లో ముఖ్యనేతలను కలిశారు. ఆ తర్వాత  తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్రలో పలు బహిరంగసభలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ పార్టీని  మహారాష్ట్రలో విస్తరించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మహారాష్ట్రలో రైతుల అభ్యున్నతి కోసం తెలంగాణ మోడల్‌ ను అమలుచేస్తామని కేసీఆర్ పలు సభల్లో ప్రకటించారు. అక్కడ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ప్రతి ఇంటికి నల్లా ద్వారా తాగునీటిని సరఫరా చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. జూన్ 15వ తేదీన సీఎం కేసీఆర్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్వస్థలమైన నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్  కార్యాలయాన్ని  ప్రారంభించారు. త్వరలో  ముంబయి, పూణె, ఔరంగాబాద్‌లలో కూడా పార్టీ కార్యాలయాలు  ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.