
సింగపూర్ : ఇండియా వెటరన్ టీటీ ప్లేయర్ ఆచంట శరత్ కమల్.. సింగపూర్ స్మాష్ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో శరత్ 11–4, 11–8, 12–10తో వరల్డ్ 22వ ర్యాంకర్ ఒమర్ అసార్ (ఈజిప్ట్)పై గెలిచాడు. తొలి రెండు గేమ్‌ల్లో మెరుగ్గా ఆడిన ఇండియన్ ప్లేయర్‌కు మూడో గేమ్‌లో పోటీ ఎదురైంది. అయితే చివర్లో రెండు కీలక పాయింట్లతో శరత్ మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో రాణించి ర్యాంక్‌ను మెరుగుపర్చుకుంటే పారిస్ ఒలింపిక్ బెర్త్ సాధించే చాన్స్ కూడా శరత్‌కు ఉంటుంది.