హైదరాబాద్, వెలుగు: నగరాల్లో వేస్ట్ మేనేజ్‌మెంట్, రవాణా, నీటి నిర్వహణ, స్మార్ట్ గవర్నెన్స్, పర్యావరణంపై స్పందన, సమగ్ర పట్టణ అభివృద్ధికి ఉపయోగపడే వినూత్న ఆలోచనలను ప్రోత్సహించేందుకు ‘అర్బన్ ఎక్స్ ఛాలెంజ్ ఐడియాథాన్ 2026’ నిర్వహిస్తున్నామని, దీనికోసం విద్యార్థులు తమ ఐడియాలను ఇవ్వాలని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టి.కె. శ్రీదేవి పిలుపునిచ్చారు.
సోమవారం ఆమె హైదరాబాద్ సీడీఎంఏ ఆఫీసులో ఐడియాథాన్ పోస్టర్‌ను ఆవిష్కరించి, మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా యువతలో ఉన్న ప్రతిభను వెలికితీసి నగరాల్లో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం లక్ష్యమన్నారు. డిగ్రీ, పీజీ విద్యార్థులు అన్ని విభాగాల నుంచి ఈ ఐడియాథాన్‌లో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ నెల 20వ తేదీ వరకు www.nium.org.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
