వైఎస్ షర్మిలపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

వైఎస్ షర్మిలపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదు

వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదు అయింది. తెలంగాణ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై పరువు నష్టం కలిగించేలా ఆమె  వ్యాఖ్యలు చేశారంటూ  నరేందర్ యాదవ్ అనే వ్యక్తి ఆమెపై  ఫిర్యాదు చేశాడు. 

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో ప్రెస్‌ మీట్​, సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీని దూషిస్తూ మాట్లాడారని ఆ పార్టీ నేత నరేందర్ యాదవ్  బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో  ఐపీసీ సెక్షన్లు  505(2), 504 సెక్షన్ల కింద షర్మిలపై  పోలీసులు కేసు నమోదు చేశారు. 

 గతంలోఎస్​ఐ, మహిళా కానిస్టేబుల్​పై చేయి చేసుకోవడంతో  షర్మిలపై  జూబ్లీహిల్స్ పోలీసులు ఆమెపై సెక్షన్​ 353, 332, 509, 427 కింద కేసు నమోదు చేశారు.  వాటితో పాటుగా రెడ్​విత్ 34, 337, మరో రెండు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు.  

ఈ కేసులో అరెస్టయిన షర్మిలకు నాంపల్లి కోర్టు రిమాండ్​ విధించింది.  దీంతో ఆమెను చంచల్​గూడ జైలుకు తరలించారు. అనంతరం నాంపల్లి కోర్టు  షరతులతో  కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.