TSPSC : పేపర్ లీక్ కేసులో ఐటీ శాఖ వైఫల్యంపై చర్యలు తీసుకోవాలి: షర్మిల

TSPSC : పేపర్ లీక్ కేసులో ఐటీ శాఖ వైఫల్యంపై చర్యలు తీసుకోవాలి: షర్మిల

టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ కేసులో ఐటీ మంత్రి కేటీఆర్ పై కేసు ఫైల్ చేయాలని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు.  టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ లో ఐటీశాఖ వైఫల్యంపై బేగంబజార్ పీఎస్ లో షర్మిల కంప్లైంట్ చేశారు. పేపర్ లీక్ కేసులో ఐటీ శాఖ వైఫల్యం  స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఒక ఐపీ అడ్రస్, పాస్ వర్డ్ తెలిసినంత మాత్రానా  పేపర్ లీక్ చేయొచ్చా  అని ప్రశ్నించారు.  ఎవరు పడితే వాళ్లు సిస్టమ్  యాక్సిస్ ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ కేసులో ఐటీ శాఖ వైఫల్యంపై దర్యాప్తు చేయాలన్నారు. ఐటీ శాఖ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సిట్ తో దర్యాప్తు చేస్తున్నారని ఆరోపించారు. 
 
ఐటీ శాఖ వైఫల్యంపై మంత్రి కేటీఆర్  బాధ్యత వహించాలన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై కేసు ఫైల్ చేయాలన్నారు. అసలు  టీఎస్ పీఎస్ సీ  అడిట్స్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సిస్టమ్స్ కు ఆడిట్ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా చెప్పాలన్నారు.  కామన్ మ్యాన్ కు అంత సులభంగా  ఐపీ అడ్రస్ ఎలా తెలుస్తందన్నారు.  ఒక ఐటీ మంత్రిగా ఉండి పేపర్ లీక్ కేసుకు సంబంధం లేదని  కేటీఆర్   ఎలా అంటారని ప్రశ్నించారు.   పేపర్ లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని విమర్శించారు.

 ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ ఇంత వరకు ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. బిశ్వాల్ కమిటీ దాదాపు రెండు లక్షల ఉద్యోగాలున్నాయని ఖాళీగా ఉన్నాయని చెప్పిందన్నారు. తొమ్మిదేళ్లు అవుతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయలేదన్నారు.