ఛలో సెక్రటేరియట్: కాంగ్రెస్ నేతల అరెస్ట్ - ఆఫీస్ లో నేలపైనే షర్మిల నిద్ర, అక్కడే దీక్ష..!

ఛలో సెక్రటేరియట్: కాంగ్రెస్ నేతల అరెస్ట్ - ఆఫీస్ లో నేలపైనే షర్మిల నిద్ర, అక్కడే దీక్ష..!

ఇటీవల విడుదలైన డీఎస్సి నోటిఫికేషన్ పై ఏపీలో నిరసనల సెగ రాజుకుంటోంది. మెగా డీఎస్సి నిర్వహించకుండా కేవలం 6100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ చేసినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఛలో సెక్రటేరియట్ కి పిలుపునిచ్చింది. దీంతో అప్రత్తమైన పోలీసులు కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ లు చేశారు. దీంతో, తనని కూడా అరెస్ట్ చేస్తారని భావించిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లోనే నేలపై పరుపు వేసుకొని నిద్రించి అక్కడే దీక్ష ప్రారంభించారు.

వైఎసార్సీపి ప్రభుత్వం అప్రజాస్వామికంగా అరెస్టులకు పాల్పడుతోందని, రాష్ట్రంలో జరుగుతున్న నియంత పాలనను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. తనను అడ్డుకోవాలని చుస్తే ముమ్మాటికీ నియంతలే అవుతారని ఆరోపించారు.తాజాగా విడుదల చేసిన డీఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి మెగా డీఎస్సి నిర్వహించాలని డిమాండ్ చేశారు.

అరెస్ట్ చేసిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, సీడబ్ల్యుసి మెంబర్ గిడుగు రుద్రరాజులను తక్షణమే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.23000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి కేవలం 6000 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని, నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు షర్మిల.

Also Read : వైఎసార్సీపి నుండి మరో వికెట్ డౌన్ - ఎంపీ రాజీనామా..!