నేను బాగానే ఉన్నాను.. యాక్సిడెంట్పై స్పందించిన శర్వానంద్

నేను బాగానే ఉన్నాను.. యాక్సిడెంట్పై స్పందించిన శర్వానంద్

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మే 28 ఆదివారం ఉదయం యాక్సిడెంట్కు గురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ఫిలింనగర్ జంక్షన్ వద్ద శర్వానంద్ ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కారు అదుపు తప్పి డివైడర్ను డీ కొట్టింది. ఈ ప్రమాదంలో శర్వా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ న్యూస్ బయటకి రావడంతో శర్వానంద్ స్నేహితులు, అభిమానులు టెన్షన్ పడ్డారు. అయితే అది చాలా చిన్న యాక్సిడెంట్ అని, ప్రమాదంలో ఎవరికి ఏమి జరగలేదని క్లారిటీ ఇచ్చారు శర్వా టీమ్.

ఇక తాజాగా శర్వానంద్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా యాక్సిడెంట్ పై స్పందించాడు. “ఈరోజు ఉదయం నా కారు యాక్సిడెంట్ న్యూస్ విని అందరూ కంగారు పడ్డారు. అది చాలా చిన్న సంఘటన. నేను పూర్తి క్షేమంగా ఉన్నాను. భయపడాల్సిన అవసరం ఏమి లేదు. మీ ప్రేమకి థాంక్యూ” అంటూ ట్వీట్ చేశాడు. 

స్వయంగా శర్వానంద్ ట్వీట్ చేయడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఇందిలా ఉండగా శర్వానంద్కు మరో వారం రోజుల్లో పెళ్లి జరగనుంది. జనవరి 26న శర్వానంద్, రక్షితతో నిశ్చితార్థం చేసుకున్నాడు. వీరి వివాహం జూన్ 3న జైపూర్ ప్యాలెస్ లో జరగనుంది. ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరు కానున్నట్టు సమాచారం.