ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిసిన హీరో శర్వానంద్

 ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిసిన హీరో శర్వానంద్

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు. 2023 జూన్ 9 శుక్రవారం రోజున హైదరాబాద్ లో నిర్వహించే తన పెళ్లి రిసెప్షన్ కు హాజరు కావాలని శర్వానంద్ సీఎంను ఆహ్వానించారు.  శర్వానంద్ ను ఆప్యాయంగా పలకరించిన సీఎం.. అతనికి పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. శర్వానంద్  రిసెప్షన్  హైదరాబాద్‌లోని కన్వెన్షన్ ఫెసిలిటీలో జరగనుంది.  

శర్వానంద్ ఇటీవల జైపూర్‌లోని ఓ లగ్జరీ ప్యాలెస్ హోటల్‌లో రక్షితారెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహ వేడుకకు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు,  రక్షితారెడ్డి ఎవరో కాదు  తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి మనవరాలు.  గతంలో కేసీఆర్, బొజ్జల టీడీపీలో కలిసి పనిచేశారు,