- జ్యోతి కొమిరెడ్డి స్మారక ఉపన్యాసానికి హాజరు
హైదరాబాద్ సిటీ, వెలుగు: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. కోరుట్ల మాజీ ఎమ్మెల్యే దివంగత కొమిరెడ్డి జ్యోతి దేవి స్మారక ఉపన్యాస సభలో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమం సాయంత్రం 5.30 గంటలకు రాజ్‌భవన్ రోడ్‌లోని ది పార్క్ హోటల్‌లో జరుగనుందని జ్యోతి కుమారుడు, ప్రముఖ అడ్వకేట్ కరం కొమిరెడ్డి తెలిపారు.'
రాడికల్ సెంట్రిజం: భారత్ కోసం నా దృక్పథం' అనే అంశంపై శశి థరూర్ ప్రసంగిస్తారు. కోరుట్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, విమెన్ రైట్స్ యాక్టివిస్ట్ జ్యోతి కొమిరెడ్డి 2024లో చనిపోయారు. వారి గుర్తుగా స్మారక ఉపన్యాసాల సిరీస్‌ను ప్రారంభిస్తున్నట్లు కరం వెల్లడించారు. ఈ నేపథ్యంలో తొలి ఉపన్యాసంలో శశి థరూర్ పాల్గొంటారు. అనంతరం ప్యానల్ డిస్కషన్‌లో జర్నలిస్ట్, రచయిత కపిల్ పాల్గొంటారని పేర్కొన్నారు.
