హైదరాబాద్లో షీ టీమ్స్కి చిక్కిన చిల్లరగాళ్ళు.. బోనాల సందడిలో బుద్ధిలేని పనులు..

హైదరాబాద్లో షీ టీమ్స్కి చిక్కిన చిల్లరగాళ్ళు.. బోనాల సందడిలో బుద్ధిలేని పనులు..

మన దేశంలో పండుగల హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి పండుగకు ప్రజలంతా ఒకచోట చేరి కలిసి మెలసి పండుగ జరుపుకుంటారు. ఇక ఊరేగింపులు, ఉత్సవాలు కామన్.. మొహరం, బోనాలు వంటి పండుగల గురించి చెప్పాల్సిన పని లేదు. డీజేలు, మేళాల చప్పుళ్లతో ఉరేగింపుల హడావిడి మాములుగా ఉండదు. అయితే.. పండుగ సందడి మాట అటుంచితే.. ఇలాంటి సందర్భాల్లో జేబుదొంగలు ఆకతాయిలు తెగ రెచ్చిపోతుంటారు.. ఇటీవల హైదరాబాద్ లో మొహరం, బోనాల పండుగపూట ఆకతాయిలు రెచ్చిపోయారు. 

ఉత్సవాల సమయంలో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ షీ టీమ్స్ కి రెడ్ హ్యాండెడ్ దొరికిపోయారు చాలామంది ఆకతాయిలు. మొహరం, బోనాల పండుగ సీజన్ లో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన 478 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు షీ టీమ్స్ అధికారులు. వీరిలో ఎక్కువ మంది మైనర్లు, వృద్ధులే ఉన్నట్లు తెలిపారు అధికారులు.

అదుపులోకి తీసుకున్న 478 మందిలో 386 మంది మేజర్లు, 92 మంది మైనర్లు ఉన్నట్లు తెలిపారు అధికారులు. వీరిలో 288 మందిని హెచ్చరించి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశామని తెలిపారు. మిగిలినవారిలో ఐదురు మందికి జరిమానా విధించి, ఒకరికి జైలు శిక్ష విధించిందని తెలిపారు అధికారులు.