బాలీవుడ్ నటి ఆత్మహత్య కేసులో సహనటుడు అరెస్ట్

బాలీవుడ్ నటి ఆత్మహత్య కేసులో సహనటుడు అరెస్ట్

బాలీవుడ్ యువనటి తునీషా శర్మ ఆత్మహత్య కేసులో ఆమె సహనటుడు షీజన్ మహమ్మద్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తునీషా తల్లి ఫిర్యాదు మేరకు  షీజన్ మహమ్మద్ ఖాన్  ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు  పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేశారు. షీజన్ ను   రేపు(సోమవారం) కోర్టులో హాజరుపరచనున్నారు. గతంలో  షీజన్ తో తునీషా రిలేషన్ షిప్ లో ఉందని..ఇటీవల్ బ్రేకప్ అయినట్లు సమాచారం. ఇవాళ ఉదయం ముంబైలోని జేజే ఆస్పత్రిలో తునీషా డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

తునీషా శర్మ  నిన్న ఓ సీరియల్ షూటింగ్ జరుగుతుండగా..మేకప్ రూంలో  ఆత్మహత్యకు పాల్పడింది.  అయితే పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని చెప్పారు. ఆమె మృతి హత్యా? లేక ఆత్మహత్యనా? అనే కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామని చెప్పారు. టీవీ షోల్లో బాగా పాపులరయ్ అయిన తునీషా శర్మ ఫితూర్, కహానీ 2, దబాంగ్ 3, దుర్గారాణి సింగ్, బార్ బార్ దేఖో వంటి పలు చిత్రాల్లో నటించింది.