
ఖైరతాబాద్, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తమ సంస్థ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కనున్నట్లు ఆరా సంస్థ ఎండీ షేక్ మస్తాన్ చెప్పారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో నిర్వహించిన తమ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 58 నుంచి 67 సీట్లు వస్తాయన్నారు.
అధికార బీఆర్ఎస్ పార్టీ 41నుంచి 49 రావచ్చని చెప్పారు. బీజేపీకి 5–7 సీట్లు రావచ్చని.. మజ్లిస్, బీఎస్పీ, సీపీఐ మూడు పార్టీలకు 7–9 సీట్లు వస్తాయని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా తమ అంచనాలను వెల్లడించారు. తాము తమ సిబ్బంది ద్వారా ఈ సర్వేను గ్రౌండ్ లెవెల్ నుంచి చేయించామని ఆయన చెప్పారు.