గురువును చూసి బోరున ఏడ్చేసిన శేఖర్ మాస్టర్

గురువును చూసి బోరున ఏడ్చేసిన శేఖర్ మాస్టర్

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌(Rakesh mastar) జూన్‌ 18 ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు రాకేష్ మాస్టర్ మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.

ఇందులో భాగంగానే టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్‌ మాస్టర్‌(Shekhar mastar) తన గురువును చివరి చూపు చూసేందుకు వచ్చారు. తన గురువును నిర్జీవంగా చూసి కంటతడి పెట్టుకున్నారు. శేఖర్‌ మాస్టర్‌ కన్నీరు పెట్టుకున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల రాకేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. మీడియా ముఖంగా చాల సార్లు విమర్శలు  కూడా చేసుకున్నారు ఈ ఇద్దరు.