శేఖర్ మోడల్ హీరోగా నటిస్తూ దర్శక నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘ఒక్క అడుగు’. గురువారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌కు దర్శకులు వీఎన్ ఆదిత్య, సముద్ర, నిర్మాతలు అశోక్ కుమార్, పద్మిని నాగులపల్లి, రామ సత్యనారాయణ అతిథులుగా హాజరై సినిమా విజయం సాధించాలని కోరారు.
శేఖర్ మోడల్ మాట్లాడుతూ ‘ఈ చిత్రంతో నాకు నేనే అవకాశం కల్పించుకున్నా. దీనికోసం చాలా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేశా. నాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని అన్నాడు.
