
‘శేషు’ మొదలు ‘మహంకాళి’ వరకూ నేను డైరెక్ట్ చేసిన అన్ని రీమేక్స్‌కు మొదట వేరే దర్శకులను అనుకున్నాం. వాళ్లు చెప్పిన మార్పులు నచ్చక నేనే డైరెక్ట్ చేయాల్సి వచ్చింది. ఇదికూడా అంతే. మలయాళ ‘జోసెఫ్’కి ఇది రీమేక్. మొదట కరుణ కుమార్, నీలకంఠ లాంటి డైరెక్టర్స్‌ను అడిగాం. వాళ్లు బిజీగా ఉండటంతో నేనే డైరెక్ట్ చేశాను. రియలిస్టిక్‌గా ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశాం. ఇష్టపడేవారెవరూ లేకుండా సింగిల్‌గా మిగిలి పోతే తన మైండ్‌సెట్, ఎమోషన్ ఎలా ఉంటుంది. ఎవరూ లేని ఒక కామన్ మ్యాన్‌కి సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరిస్తాడనేదే ఈ సినిమా. రాజశేఖర్ గారు రియల్ లైఫ్‌లో చాలా సాఫ్ట్ అండ్ సెన్సిటివ్. ఇందులో పాత్ర ఆయన రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉంటుంది. కూతురి పాత్రలో శివాని నటించింది. ఎమోషన్, సెంటిమెంట్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లాంటివన్నీ బ్యాలెన్సుడ్‌గా ఉంటాయి. హార్ట్ ఉన్న ప్రతి ఒక్కరికీ టచ్ అవుతుంది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ‘శేఖర్’ ఉంటాడు. మా సినిమాకు ప్రత్యేకంగా టికెట్ రేట్లు పెంచొద్దని, గవర్నమెంట్ ఇచ్చిన రేట్స్‌తోనే టికెట్స్ అమ్మమని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను కోరాం. ఇక విలన్‌గా నటించడానికి రాజశేఖర్ గారు రెడీగా ఉన్నారు. నిజానికి ఆయన కెరీర్ మొదలైందే నెగిటివ్ రోల్స్‌తో. అలాగని రెగ్యులర్ విలన్ రోల్స్ కాకుండా డిఫరెంట్‌గా ఉండేవి అయితే కచ్చితంగా చేస్తారు. చిరంజీవి గారి సినిమాలో విలన్‌గా నటించేందుకైనా రెడీ. ఆయనతో మాకెలాంటి విభేదాలు లేవు. అమ్మ, అమ్మమ్మ అని తేడా లేకుండా మంచి క్యారెక్టర్ ఏది వచ్చినా చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నాను.