
హైదరాబాద్: వారం రోజుల క్రితం శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కార్ పార్కింగ్ వివాదంలో ఓ మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. లక్ష్మివిహర్ లోని తన నివాసం సమీపంలో పార్కింగ్ వివాదంలో కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్.. మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించడంతో కేసు నమోదు చేసి, శనివారం రిమాండ్ కు తరలించామని తెలిపారు సైబరాబాద్ పోలీసులు. అయితే వెంటనే కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ బెయిల్ పై విడుదల కావడం గమనార్హం.
వీడియో: యువతిపై దాడి చేసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్