
పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఆరుదైన రికార్డును సొంతం చేసున్నాడు. ఏప్రిల్ 1న కేకేఆర్‌తో మ్యాచ్‌లో 40 పరుగులు చేసిన ధావన్.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 50 ప్లస్ రన్స్ భాగస్వామ్యాన్ని సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీతో సమానంగా నిలిచాడు. కోహ్లీ ఇప్పటివరకు 94 సార్లు 50 ప్లస్ రన్స్ భాగస్వామ్యాలు నమోదు చేయగా తాజాగా దానిని ధావన్ సమం చేశాడు.
ఈ మ్యాచ్ లో ధావన్ 40 పరుగులు చేసి బానుక రాజపక్సతో కలిసి రెండో వికెట్‌కు 86 పరుగులు జోడించాడు. ఇక ఈ లిస్టులో మూడో స్థానంలో సురేశ్ రైనా(83 అర్థశతక భాగస్వామ్యాలు), డేవిడ్ వార్నర్ 82 50ప్లస్ భాగస్వామ్యాలతో నాలుగో స్థానంలో ఉన్నారు. కాగా కేకేఆర్‌తో జరిగిన మ్యా్చ్ లో పంజాబ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.