Shikhar Dhawan: చిక్కుల్లో టీమిండియా మాజీ ఓపెనర్.. బెట్టింగ్ యాప్ కేసులో శిఖర్ ధావన్‌కు ఈడీ సమన్లు

Shikhar Dhawan: చిక్కుల్లో టీమిండియా మాజీ ఓపెనర్.. బెట్టింగ్ యాప్ కేసులో శిఖర్ ధావన్‌కు ఈడీ సమన్లు

భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్‌ ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. ఈ మాజీ ఓపెనర్ పై అక్రమ బెట్టింగ్ యాప్‌తో లింక్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మనీలాండరింగ్ దర్యాప్తుకు సంబంధించి భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ప్రశ్నించినట్లు అధికారులు బుధవారం (సెప్టెంబర్ 3) తెలిపారు. బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ 1xBet సోషల్ మీడియా ప్రమోషన్‌లకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ధావన్ గురువారం (సెప్టెంబర్ 4) ఉదయం 11 గంటలకు కోర్టు ముందు హాజరు హాజరయ్యాడు.

మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద అధికారులు అతని వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. 39 ఏళ్ల శిఖర్ ధావన్  ఎండార్స్‌మెంట్ ఒప్పందాల ద్వారా బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌తో పార్ట్ నర్ గా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇటీవల  చట్టాన్ని ప్రవేశపెట్టి రియల్-మనీ ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధించింది. గత నెలలో మాజీ క్రికెటర్ సురేష్ రైనాను ఈ కేసులో ఫెడరల్ దర్యాప్తు సంస్థ ప్రశ్నించింది. గత ఏడాది నుండి అక్రమ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించారనే ఆరోపణలతో  అనేక మంది బాలీవుడ్ సౌత్ సిమీ సెలెబ్రిటీలతో పాటు క్రికెటర్లు కూడా ఉన్నారు. 

2024 ఆగస్టు లో ధావన్ అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2010లో విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో వన్డేల్లో అరంగేట్రం చేసిన ధవన్‌‌‌‌.. 14 ఏళ్ల కెరీర్‌‌‌‌లో 167 మ్యాచ్‌‌‌‌లు ఆడాడు. 17 సెంచరీలు, 39 హాఫ్‌‌‌‌ సెంచరీలు సహా 6793 రన్స్‌‌‌‌ చేశాడు. 2022లో బంగ్లాదేశ్‌‌‌‌తో చివరి వన్డేలో పోటీపడ్డాడు.  2013లో మొహాలీలో  ఆసీస్‌‌‌‌పై టెస్టు అరంగేట్రం చేసిన ధవన్‌‌‌‌.. 2018లో ఇంగ్లండ్‌‌‌‌తో చివరి మ్యాచ్‌‌‌‌ ఆడాడు. 34 టెస్టుల్లో 2315 రన్స్‌‌‌‌ చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 5 ఫిఫ్టీలు ఉన్నాయి. సగటు 40.61గా ఉంది. 2011లో వెస్టిండీస్‌‌‌‌పై తొలి టీ20 ఆడిన ధవన్‌‌‌‌ 68 మ్యాచ్‌‌‌‌ల్లో 27.92 సగటుతో 1759 రన్స్‌‌‌‌ చేశాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2021లో శ్రీలంకతో చివరి టీ20 మ్యాచ్‌‌‌‌ ఆడాడు.