బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలిగా శిల్పారెడ్డి బాధ్యతల స్వీకరణ

బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలిగా శిల్పారెడ్డి బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్, వెలుగు :  బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలిగా శిల్పారెడ్డి బాధ్యతలు చేపట్టారు. సోమవారం పార్టీ స్టేట్ ఆఫీసులో బీజేపీ రాష్ట్ర నేతలు మనోహర్ రెడ్డి, ఆకుల విజయ, రాణి రుద్రమ, హరీశ్​ రెడ్డిల సమక్షంలో ఆమె బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల వివిధ మోర్చాల బాధ్యులను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మార్చా రు. అందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న గీతా మూర్తి స్థానంలో శిల్పారెడ్డిని నియమించగా, ఆమె ఇప్పుడు బాధ్యతలు  స్వీకరించారు.