లిస్టింగ్లో అదరగొట్టిన షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాకెట్

లిస్టింగ్లో అదరగొట్టిన షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  రాకెట్

ఐపీఓ  ధర కంటే 48శాతం లాభంతో ముగింపు!

న్యూఢిల్లీ: లాజిస్టిక్స్ కంపెనీ   షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాకెట్ స్టాక్ మార్కెట్లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది.  కంపెనీ షేర్లు బుధవారం ఐపీఓ ధర రూ. 97 కంటే దాదాపు 48 శాతం లాభంతో ముగిశాయి.  ఇష్యూ ధర కంటే 33.50శాతం ప్రీమియంతో రూ. 129.50 వద్దప్రారంభమై, చివరికి 47.93శాతం లాభంతో రూ. 143.50 వద్ద సెటిలయ్యాయి.  కంపెనీ మొత్తం మార్కెట్ విలువ రూ. 10,440.74 కోట్లకు చేరింది. 

ఆగస్టు 24 నుంచి సింబయోటెక్ ఐపీఓ

ఫార్మా, బయోటెక్ కంపెనీ  'సింబయోటెక్ ఫార్మాల్యాబ్' రూ. 1,757 కోట్లు సేకరించేందుకు  ఐపీఓకి వస్తోంది. కంపెనీ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 24న ఓపెన్ అవుతుంది.  ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  రూ. 938– 988గా నిర్ణయించారు. ఈ ఐపీఓ ఆగస్టు 27న ముగుస్తుంది.