హెచ్‌‌సీఎల్ శివ్‌‌ నాడార్‌‌‌‌కు రూ.9,906 కోట్ల డివిడెండ్ ఆదాయం

హెచ్‌‌సీఎల్ శివ్‌‌ నాడార్‌‌‌‌కు రూ.9,906 కోట్ల డివిడెండ్ ఆదాయం

న్యూఢిల్లీ:  లిస్టెడ్ కంపెనీల నుంచి ఎక్కువగా డివిడెండ్ అందుకున్న వారిలో విప్రో అజీం ప్రేమ్‌‌జీ, వేదాంతకు చెందిన అనిల్ అగర్వాల్‌‌ను హెచ్‌‌సీఎల్ ఫౌండర్  శివ నాడార్ అధిగమించారు. నాడార్ కుటుంబం 2024–25లో హెచ్‌‌సీఎల్‌‌ టెక్నాలజీస్ నుంచి రూ.9,906 కోట్ల డివిడెండ్ ఆదాయం పొందింది.  అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో అందుకున్న  రూ.8,585 కోట్లతో పోలిస్తే పెరిగింది.   హెచ్‌‌సీఎల్‌‌ టెక్నాలజీస్‌‌లో 60.82శాతం వాటా నాడార్ ఫ్యామిలీ కంట్రోల్లో ఉంది. ఈ టెక్ కంపెనీ కిందటి ఆర్థిక సంవత్సరంలో  రూ.16,290 కోట్ల డివిడెండ్ చెల్లించింది. 

 సబ్సిడరీ కంపెనీలు డివిడెండ్ ప్రకటించలేదు. అజీం ప్రేమ్‌‌జీ కుటుంబం విప్రో నుంచి 2024–25 లో రూ.4,570 కోట్ల డివిడెండ్ ఆదాయం పొందింది. 2023–24లో పొందిన రూ.9,128 కోట్లతో పోలిస్తే సగానికి తగ్గింది.  ప్రేమ్‌‌జీ కుటుంబానికి విప్రోలో 72.7శాతం వాటా ఉంది.  అన్‌‌లిస్టెడ్ హోల్డింగ్ కంపెనీలు, వ్యక్తిగత షేర్‌‌హోల్డింగ్‌‌ల ద్వారా ఈ వాటాను కంట్రోల్ చేస్తోంది. లిస్టెడ్ కంపెనీల నుంచి వ్యక్తిగత ప్రమోటర్లు, వారి కుటుంబాలు పొందిన డివిడెండ్ ఆదాయం, బైబ్యాక్ ఆదాయాలను పరిగణనలోకి తీసుకొని ఈ లెక్కలు వేశామని  బిజినెస్ స్టాండర్డ్‌‌ రిపోర్ట్ చేసింది.