
జమ్ము కశ్మీర్ లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు శివసేన లీడర్ సంజయ్ రౌత్. బిహారి కూలీలు, సిక్కులు, కశ్మీరి పండిట్లే టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయన్నారు. పాక్ గురించి చర్చ రాగానే బీజేపీ నేతలు సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని ప్రకటనలు చేస్తారని..చైనా విషయంలోనూ అలాగే స్పందించాలన్నారు సంజయ్ రౌత్. జమ్ము కశ్మీర్ లో పరిస్థితులపై హోంమంత్రి అమిత్ షా లేదా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేయాలన్నారు సంజయ్ రౌత్. జమ్ము కశ్మీర్‌లో కొద్ది రోజులుగా ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారిని టార్గెట్ చేసి టెర్రరిస్టులు హత్యలు చేస్తున్న నేపథ్యంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు.