T20 వరల్డ్‌ కప్‌లో సంచలనం: స్కాట్లాండ్ చేతిలో బంగ్లా చిత్తు

T20 వరల్డ్‌ కప్‌లో సంచలనం: స్కాట్లాండ్ చేతిలో బంగ్లా చిత్తు

ఆస్ట్రేలియా,న్యూజిలాండ్లపై T20 సిరీస్ గెలిచి జోరు మీదున్న బంగ్లాదేశ్ కు షాకిచ్చింది స్కాట్లాండ్. T20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్-12 కోసం జరుగుతున్న క్వాలిఫయింగ్ మ్యాచులో బంగ్లాదేశ్ ను మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ టీం 20 ఓవర్లలో 9 వికెట్ల కోల్పోయి 140 రన్స్ చేసింది. ఓ దశ లో 53 రన్స్ కే కష్టాల్లో పడిన స్కాట్లాండ్ టీంను క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్ ఆదుకున్నారు. 28 బాల్స్ ఆడిన గ్రీవ్స్...2 సిక్సులు..4 ఫోర్ల సాయంతో 45 పరుగులు చేయగా..17 బాల్స్ లో 2 ఫోర్లతో 22 రన్స్ చేశాడు వాట్. బంగ్లా బౌలర్లలో మెహది హసన్ 3, షకీబ్ అల్ హసన్, సైఫుద్దీన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 

తర్వాత 141 రన్స్ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన బంగ్లా 20 ఓవర్లలో 134 రన్స్ మాత్రమే చేసింది. దీంతో స్కాట్లాండ్ పై 6 రన్స్ తేడాతో ఓడిపోయింది. బంగ్లా జట్టులో ముష్ఫికర్ రహిమ్ 38 రన్స్ చేయగా..షకిబ్ అల్ హసన్ 20, మహ్మదుల్లా 23 పరుగులు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్లి వీల్ 3 వికెట్లు, క్రిస్ గ్రీవ్స్ 2 వికెట్లు పడగొట్టారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో రాణించిన క్రీస్ గ్రీవ్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

మరిన్ని వార్తల కోసం..

రామాయణంపై ఇంటర్నేషనల్ లెవల్ క్విజ్

ప్రతి గింజ కొనాలి.. లేదంటే నీ ఫామ్‌హౌస్‌కు తెస్తం: రఘునందన్

జనగామలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం