జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ప్రకాశ్ రాజ్ కంప్లైంట్

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ప్రకాశ్ రాజ్ కంప్లైంట్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ ఎన్నికల హీట్ ఇంకా చల్లారలేదు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, హీరో మంచు విష్ణు ప్యానెల్స్ మధ్య హోరాహోరీ మాటల యుద్ధం నడిచింది. గత ఆదివారం పోలింగ్ జరుగుతున్న సమయంలోనూ రెండు వర్గాల మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ రోజు మంచు మోహన్ బాబు తమపై దాడి చేశారంటూ ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లోని నటులు కొందరు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఎలక్షన్ జరిగిన జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌కు ఈ రోజు ప్రకాశ్ రాజ్ వచ్చారు.

అనంతరం ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎలక్షన్ రోజు జరిగిన దాడిపై ఫిర్యాదు చేశారు. హీరో తనీష్‌పై దాడి జరిగిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ప్రకాశ్ రాజ్ చెప్పారు. సీసీటీవి ఫుటేజీ పరిశీలిస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన తీరుపై తమకు అనుమానాలున్నాయన్నారు ప్రకాష్ రాజ్. వాటిని క్లారిఫై చేసుకునేందుకు జూబ్లిహిల్స్ స్కూల్ కు వచ్చానన్నారు. ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణ మోహన్ నుంచి ఎలాంటి రిప్లై రావడం లేదన్నారు. సీసీ ఫుటేజీ చూడమని విష్ణు చెప్తుంటే..ఎలక్షన్ ఆఫీసర్ మాత్రం కోర్టుకు వెళ్లమంటున్నాడని ఆరోపించారు. సమస్య అంత ఎన్నికల అధికారితోనే ఉందన్నారు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ ఫిర్యాదుతో సీసీ టివి ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఆన్‌లైన్‌లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సేవలు

అధికారి​ వేధింపులతో సింగరేణి కాంట్రాక్ట్​ వర్కర్ ​ఆత్మహత్యాయత్నం

కుటుంబాలకు కన్నీటిని మిగులుస్తున్న రోడ్డు ప్రమాదాలు