దేశవ్యాప్తంగా ఘనంగా శివరాత్రి వేడుకలు

దేశవ్యాప్తంగా ఘనంగా శివరాత్రి వేడుకలు

దేశవ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు భక్తులు. శివనామస్మరణలతో  శైవ క్షేత్రాలు.. మార్మోగుతున్నాయి. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం శ్రీరాజరాజేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా టీటీడీ తరపున డిప్యూటీ ఈవో హరినాథ్….స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. మరోవైపు స్వామి వారిని దర్శించుకున్నారు మరో మంత్రి ఈటల రాజేందర్. భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేసి, రాజన్నను దర్శించుకుంటున్నారు. సర్వ దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడ్తోంది. సాయంత్రం కళ్యాణ మండపంలో ఆలయ అనువంశక అర్చకులు మహా లింగార్చన నిర్వహించనున్నారు. రాత్రి లింగోద్భవ కాలంలో శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరగనుంది.

మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్ లోని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు బారులు తీరి దైవ దర్శనం చేసుకుంటున్నారు. శివుడికి అభిషేకాలు, అర్చనలు చేస్తున్నారు. మణికొండ ఓయూ కాలనీలోని ఉమా రామలింగేశ్వర స్వామి శివ నామ స్మరణతో మారుమోగుతోంది. మరిన్ని వివరాలు హరిత అందిస్తారు.

మహాశివరాత్రి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలోని శ్రీస్వయంభూ రాజేశ్వర ఆలయం కిటకిటలాడుతోంది. ఉదయం నుంచే భక్తులు స్వామి వారి దర్శనానికి పోటెత్తారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

ఢిల్లీలోని మంగల్ మహాదేవ్ ఆలయానికి భక్తులు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో వచ్చి పూజలు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

గోరఖ్ పూర్ లోని ప్రసిద్ధ శివాలయం జార్ఖండి ఆలయం శివనామ స్మరణతో మారుమోగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు చేశారు. వేకువ జాము 3 గంటల నుంచే క్యూ కట్టారు. అభిషేక ప్రియుడైన శివుడికి బిల్వ పత్రాలు, రకరకాల నైవేద్యాలతో ఆరాధన చేశారు భక్తులు.

ఆ ప్రేమకు పట్టాభిషేకం జరిగిన రోజు మహా శివరాత్రి