ఇండోనేషియాలో జరిగిన ఓ వివాహం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 74 ఏళ్ల టార్మాన్ అనే వ్యక్తి 24 ఏళ్ల సోల్లా అరికా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ వయసు తేడా మాత్రమే కాదు, పెళ్లి కి సంబంధించిన ప్రతిదీ అందరిని ఆశ్చర్యపర్చింది.
అక్టోబర్ 1న తూర్పు జావా ప్రావిన్స్‌లోని పసిటాన్ రీజెన్సీలో వివాహ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో వరుడు తన యువ వధువుకు 3 బిలియన్ ఇండోనేషియా రూపాయిలు అంటే భారతీయ కరెన్సీలో రూ.2కోట్లు వధూవర ధర బహుమతిగా ఇచ్చాడు.
ఇదే కాదు.. పెళ్లికి హాజరైన ప్రతి అతిథికి రూ.6వేల నగదు కూడా అందించడంతో ఈ వివాహాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపింది.సాధారణంగా ఇండోనేషియాలో వధూవర ధర అనే సంప్రదాయం ఉంది.. అయితే ఇంత భారీ మొత్తంలో ఇవ్వడం అరుదైన ఘటనగా భావిస్తున్నారు.మొదట్లో ఈ వివాహానికి ఒక బిలియన్ రూపాయిల వధూవర ధర నిర్ణయించగా.. చివరికి టార్మాన్ దాన్ని మూడు బిలియన్ రూపాయలుగా పెంచి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
50 ఏళ్ల వయసు తేడాతో పెళ్లి.. ఖరీదైన బహుమతులు, భారీ మొత్తం వధువర ధర.. ఇవన్నీ టార్మాన్, సోల్లా అరికా పెళ్లిని ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకునేలా చేశాయి. ఇండోనేషియాలోని కొన్ని ప్రాంతాలలో విలాసవంతమైన పెళ్లిళ్లు కామన్.. అయినప్పటికీ భారీగా వధువు ధర, అతిథులకు డబ్బును పంచడం వంటివి ఈ వివాహాన్ని ప్రత్యేకంగా సంచలనాత్మకంగా మార్చాయి.
ఈ పెండ్లి గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. కొందరు ఈ వివాహాన్ని ఆసక్తిగా, కొందరు ఇదేం పెళ్లిరా బాబు అంటూ విమర్శలతో స్పందించారు.
