V6 News

వారాసిగూడ పవిత్ర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..

వారాసిగూడ పవిత్ర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..

హైదరాబాద్ లో వారాసిగూడ బాపూజీ నగర్ బస్తీలో సోమవారం ( డిసెంబర్ 8 )  జరిగిన పవిత్ర హత్య సంచలనం రేపిన సంగతి తెలిసిందే. పెళ్ళికి ఒప్పుకోలేదని అమ్మాయి ఇంటికి వెళ్లి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు నిందితుడు. ఈ క్రమంలో బుధవారం ( డిసెంబర్ 10 ) మీడియాతో మాట్లాడుతూ పవిత్ర హత్య కేసు విషయంలో సంచలన విషయాలు వెల్లడించారు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి. ఈ కేసులో నిందితుడు ఉమాశంకర్ ను అరెస్ట్ చేశామని తెలిపారు బాలస్వామి.

జగడ లక్ష్మీ కుటుంబం కొన్నేళ్ల క్రితం శ్రీకాకుళం నుండి హైదరాబాద్ కు ఉపాధి నిమిత్తం వచ్చారని.. లేబర్ పని చేస్తూ ఇక్కడే జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. మృతురాలు పవిత్రుకు ఆరు నెలల క్రితం నిందితుడు ఉమ శంకర్ తో పెళ్లి నిశ్చయం చేశారని అన్నారు. డిసెంబర్ 8వ తేదీ మధ్యానం పవిత్ర ఉంటున్న ఇంటికి వచ్చిన ఉమ శంకర్ తనతో తెచ్చుకున్న కత్తితో పవిత్ర పై ఉమ శంకర్ దాడి చేశాడని తెలిపారు పోలీసులు.

దాడి అనంతరం నిందితుడు పారిపోయాడని.. ఆసుపత్రికి తరలిస్తుండగా పవిత్ర చనిపోయిందని తెలిపారు. తల్లి లక్ష్మీ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు డీసీపీ బాలస్వామి. ఉమ శంకర్ టైల్స్ పని చేస్తున్నాడని.. తాగుడు ఇతర అలవాట్లకు బానిసగా మారడంతో పవిత్ర ఉమాశంకర్ ను వద్దనుకుందని తెలిపారు.

ఉమ శంకర్ ప్రవర్తన నచ్చక పవిత్ర అతన్ని దూరం పెట్టగా.. నిందితుడు పవిత్రను చంపాలి అనుకున్నాడని తెలిపారు పోలీసులు. పవిత్రను చంపే ఉద్దేశంతోనే ఉమాశంకర్ పవిత్ర ఇంటికి వచ్చాడని తెలిపారు పోలీసులు. హత్య అనంతరా నిందితుడు వదిలేసినా కత్తిని సీజ్ చేసినట్లు తెలిపారు పోలిసులు. హత్య అనంతరం నిందితుడు పద్మారావు నగర్ లో అతని సోదరుని ఇంటికీ వచ్చాడని... అక్కడే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు పోలీసులు.