హైదరాబాద్: మియాపూర్ గోకుల్ ఫ్లాట్స్లో షాకింగ్ ఘటన జరిగింది. CA చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించాడు. కర్నూలు జిల్లాకు చెందిన జనార్దన్ చార్టెడ్ అకౌంటెంట్ (CA) చదువుతున్నాడు. జనార్ధన్ తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫ్లాట్లో ఉంటున్న వాళ్లు చెప్పారు.
అయితే.. ఘటనా స్థలంలో రక్తపు మరకలు ఉండటంతో తల్లిదండ్రుల అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, గదిలో రక్తం ఉండటం చూస్తుంటే దీని వెనుక ఏదో కుట్ర ఉందనే అనుమానాలు ఉన్నాయని పోలీసులకు జనార్ధన్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మియాపూర్ పోలీసులు క్లూస్ టీం సాయంతో గదిలోని ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నప్పటికీ.. ఘటనా స్థలంలో రక్తపు మరకలు పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.
