గాల్లో కలిసిన మరో భర్త ప్రాణం.. హైదరాబాద్ బాచుపల్లిలో ఘటన.. భార్యే చంపిందని ఎలా తెలిసిందంటే..

గాల్లో కలిసిన మరో భర్త ప్రాణం.. హైదరాబాద్ బాచుపల్లిలో ఘటన.. భార్యే చంపిందని ఎలా తెలిసిందంటే..

హైదరాబాద్: సర్వేయర్ తేజేశ్వర్ ఘటన మరువక ముందే హైదరాబాద్ సిటీలో భర్తను భార్య చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని బాచుపల్లిలో అంజిలప్ప అనే వ్యక్తిని అతని భార్య రాధ హత్య చేసింది. అంజిలప్ప కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు రాధపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. రాధ తన భర్తను హత్య చేసి సడెన్ డెత్గా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. భార్యాభర్త సిటీలోని ఒక కాంట్రాక్టర్ దగ్గర కూలీలుగా పని చేస్తున్నారు. రాధ ప్రియుడి విషయంలో భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తింది. తాగి పడిపోయిన భర్త గుండెల మీద దాడి చేసి గొంతు నులిమి భార్య రాధ హత్య చేసింది. ఎవరికి అనుమానం రాకుండా తాగి చనిపోయాడని పక్కన వారిని నమ్మించింది.

మృతదేహాన్ని నారాయణ పేటకు తరలించగా అంజిలప్ప గొంతు నులిమినట్లుగా గుర్తులు కనిపించాయి. దీంతో.. అంజిలప్ప కుటుంబ సభ్యులకు రాధపై అనుమానం వచ్చింది. గొంతు దగ్గర గాయాలు ఉండటంతో పోలీసులకు అంజిలప్ప కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఘటన బాచుపల్లిలో జరగడంతో నారాయణ్ పేట్ పోలీసులు ఈ కేసును బాచుపల్లికి బదిలీ చేశారు. బాచుపల్లి పోలీసులు రాధను విచారించగా తానే భర్తను చంపేసినట్లు రాధ ఒప్పుకుంది. దీంతో.. దర్యాఫ్తు అనంతరం రాధను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

ALSO READ | రూ.120కి రూ.720 పెట్రోల్ : ఏంటి అని అడిగితే కొట్టారు.. కేసు నమోదు..

రాధ, అంజిలప్పకు పెళ్లై పదేళ్లయింది. బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం హైదరాబాద్ సిటీకి వచ్చి కూలీ పనులు చేసుకుంటున్నారు. ధన్వాడ మండలం రాంకిష్టయ్యపల్లికి చెందిన రాధకు ధన్వాడలో ఒక యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం అంజిలప్పకు తెలిసి ఇలాంటి పని చేయొద్దని భార్యను మందలించాడు. జూన్ 23న మద్యం మత్తులో ఉన్న అంజిలప్పను రాధ గొంతు నులిమి హత్య చేసింది. మద్యానికి బానిసై తాగి చనిపోయాడని నమ్మించాలని రాధ భావించినప్పటికీ అంజిలప్ప గొంతు మీద ఉన్న గుర్తుల కారణంగా రాధ ప్లాన్ బెడిసి కొట్టింది.