రూ.120కి రూ.720 పెట్రోల్ : ఏంటి అని అడిగితే కొట్టారు.. కేసు నమోదు..

రూ.120కి రూ.720 పెట్రోల్ : ఏంటి అని అడిగితే కొట్టారు.. కేసు నమోదు..

సాధారణంగా బండిలో పెట్రోల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంకుకి వెళ్తుంటాం.. అయితే ఒకోసారి అనుకోని సందర్భాల్లో లేదా పొరపాటున కూడా చెప్పిన మొత్తం కంటే ఎక్కువ మొత్తానికి పెట్రోల్ కొట్టడం జరుగుతుంటుంది. కానీ బీహార్‌లో జరిగిన ఇలాంటి సంఘటన మాత్రం తీవ్ర దుమారం లేపింది. ఇంకా ఏకంగా కొట్టుకోవడం వరకు వెళ్ళింది. అది కూడా ఒక పోలీస్ అధికారుడిని...  

వివరాలు చూస్తే బీహార్‌లోని ఓ ప్రాంతంలో చెప్పినదానికంటే పొరపాటున రూ.720 పెట్రోల్ కొట్టినందుకు ఒక పోలీసు అధికారి పై పెట్రోల్ పంప్ సిబ్బంది దాడి చేసారు. అసలు విషయం ఏంటంటే  ఆ పోలీసు అధికారి మొదట రూ.120 పెట్రోల్ తన బండిలో నింపామని అడిగాడు.

బీహార్‌లోని సీతామర్హి జిల్లాలో ఇటీవల ఈ సంఘటన జరిగింది, ఓ పోలీసు అధికారి తన వాహనంలో పెట్రోల్ పోయించుకోవడానికి  పెట్రోల్ బంకుకి వెళ్ళాడు. దింతో అక్కడ ఉన్న  పెట్రోల్ పంప్ ఉద్యోగిని రూ.120 పెట్రోల్ కొట్టమని  అడిగాడు. అయితే, ఆ ఉద్యోగి పొరపాటున రూ.720 పెట్రోల్ పోశాడు. దీనితో ఆగ్రహించిన పోలీసు అధికారి బంకు ఉద్యోగిని చెంపదెబ్బ కొట్టాడు. కానీ తరువాత జరిగిన సంఘటన అతన్ని షాక్‌కు గురిచేసింది.

పెట్రోల్ పంపు మేనేజర్‌తో సహా ఇతర సిబ్బంది కలిసి పోలీసు అధికారిపై దాడి చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కెమెరాలో రికార్డైంది, ఇందులో బంకు ఉద్యోగి పోలీసు అధికారిని కనీసం నాలుగైదు సార్లు చెంపదెబ్బ కొట్టడం చూడవచ్చు. మరో సిబ్బంది కూడా పోలీస్ అధికారిపై చెయ్యి చేసుకున్నారు. చివరికీ  దీనిపై పోలీసులు  కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.