
హైదారాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు నగారా మోగటంతో ఎక్సైజ్‌కు ఎన్నికల కిక్కు ఎక్కనుంది. వచ్చే రెండు నెలల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు ఉండడంతో ఈ రెండు నెలలు భారీగా మద్యం అమ్మకాలు జరగనున్నాయి. మరో వైపు రాష్ట్రంలో పెద్ద పండుగ అయిన దసరా కూడా ఉండడంతో ఆ సమయంలో రికార్డు స్థాయిలో లిక్కర్ అమ్మకాలు జరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధరణంగా పండుగ సమయంలో ఎక్కువ సేల్స్ ఉంటుండగా.. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ కూడా రావటంతో సేల్స్ మరింత పెరగనున్నాయి. రాష్ట్రంలో వైన్స్ లైసెన్సుల గడువు నవంబర్ 30న ముగియనుంది. కొత్త లైసెన్స్‌ల కోసం ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది.