హైదరాబాద్లో OG సినిమా బ్లాక్ టికెట్ల దందా.. ఒక ప్రముఖ నిర్మాత ఆఫీస్ ముందే నిర్వాకం

హైదరాబాద్లో OG సినిమా బ్లాక్ టికెట్ల దందా.. ఒక ప్రముఖ నిర్మాత ఆఫీస్ ముందే నిర్వాకం

హైదరాబాద్: హైదరాబాద్ సిటీలో పవన్ కల్యాణ్ తాజా సినిమా OG బ్లాక్ టికెట్ల బాగోతం బయటపడింది. ఒక ప్రముఖ నిర్మాతకు చెందిన సినీ కార్యాలయం సమీపంలో OG సినిమా బ్లాక్ టికెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి దగ్గర నుంచి 25 ఓజీ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ అభిమానులతో పాటు టాలీవుడ్లో OG సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఫ్యాన్స్లో ఉన్న ఈ హైప్ను సొమ్ము చేసుకునేందుకు కొందరు బ్లాక్ టికెట్ల దందాకు దిగారు.

ఒక ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ దగ్గరుండి మరీ ఈ బ్లా్క్ టికెట్ల దందాను ప్రోత్సహిస్తుందని.. OG సినిమా ప్రీమియర్ షో టికెట్ను 3 వేల నుంచి 5 వేల మధ్య అమ్ముకుంటున్నారని సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరుగుతోంది. 

Also Read : జాన్వీకపూర్ కొత్త లుక్.. తల్లి శ్రీదేవిని గుర్తు చేస్తూ

హైదరాబాద్లోని కొన్ని ప్రముఖ సింగిల్ స్క్రీన్ థియేటర్లు ప్రీమియర్ షో టికెట్లను బుకింగ్ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచకపోవడం కూడా OG బ్లాక్ టికెట్ల దందా హైదరాబాద్ సిటీలో గట్టిగా నడుస్తుందనే ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. హైదరాబాద్ సిటీలోని మల్టీప్లెక్స్ల్లో ఇప్పటివరకూ OG సినిమా ప్రీమియర్ షో టికెట్లు బుకింగ్ వెబ్సైట్స్లో కనిపించకపోవడం గమనార్హం.