మోడ్రస్ కాస్ట్యూమ్స్‌లో గ్లామరస్‌గా కనిపించే జాన్వీకపూర్.. తాజాగా ఇలా చీరకట్టులో కనువిందు చేసింది. తను హీరోయిన్‌గా నటించిన ‘హోమ్ బౌండ్’ సినిమా ఆస్కార్‌కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి జరిగిన ఈ మూవీ స్పెషల్ స్క్రీనింగ్‌కు జాన్వీ కపూర్ ఇలా చీరకట్టులో హాజరైంది. తన తల్లి శ్రీదేవికి చెందిన నీలం రంగు చీరని కట్టుకుని రావడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. గతంలో ఆ చీర కట్టుకున్నప్పుడు శ్రీదేవి ధరించిన ఆభరణాలు వేసుకుని తన తల్లిని గుర్తు చేసింది జాన్వీ. సెప్టెంబర్ 26న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. దీని తర్వాత వారం గ్యాప్‌తో ఆమె నటించిన ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’ చిత్రం విడుదల కానుంది.
