దోహా: ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్‌లో ఇండియా షూటర్లు సురుచి సింగ్, సానియమ్ వరుసగా గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించారు. శనివారం జరిగిన విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో సురుచి 245.1 పాయింట్లతో పోడియం ఫినిష్ చేసింది. ఈ క్రమంలో 2019లో మను బాకెర్ నెలకొల్పిన జూనియర్ వరల్డ్ రికార్డు (245.1)ను బ్రేక్ చేసింది. సానియమ్ 243.3 పాయింట్లతో రెండో ప్లేస్‌లో నిలిచింది.
డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మను బాకెర్ 179.2 పాయింట్లతో ఐదో ప్లేస్‌తో సరిపెట్టుకుంది. మెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో రుద్రాంక్ష్ 209.9 పాయింట్లతో నాలుగో ప్లేస్‌కు పరిమితం కాగా, అర్జున్ ఆరో ప్లేస్‌తో సరిపెట్టుకున్నాడు. అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్‌లో అర్జున్ 633.3, రుద్రాంక్ష్ 631.9 పాయింట్లతో వరుసగా మూడు, నాలుగో ప్లేస్‌లో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించారు.
విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో ఎలావనిల్ వాలరివన్ ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది. క్వాలిఫికేషన్‌లో 630 పాయింట్లతో తొమ్మిదో ప్లేస్‌లో నిలిచింది.
